శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో కలెక్టర్ టీఎస్ చేతన్ యూరియా సరఫరాపై శనివారం మధ్యాహ్నం అధికారులతో సమీక్ష నిర్వహించారు. యూరియా సరఫరా పర్యవేక్షణలో ఆర్డీవోలు, వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అక్రమ పంపిణీ జరిగినట్లయితే 6A కేసులు నమోదు చేయాలన్నారు. ఈ క్రాప్ సీజన్ సమర్థవంతంగా సాగాలంటే సరైన సరఫరా అవసరమని తెలిపారు.