రాజీ మార్గమే రాజ మార్గమని పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ముజీబ్ పస్పుల అన్నారు. శనివారం పుట్టపర్తిలోని జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ కాబడిన కేసులను పరిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికి 53 కేసులు పరిష్కరించామన్నారు. మరిన్ని కేసులు కక్షిదారులు పరిష్కరించుకోవాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.