మైదుకూరు పట్టణం వద్ద ప్రొద్దుటూరు రోడ్డునుంచి బద్వేల్ రోడ్డుకు కొత్తగా ఏర్పాటు చేసిన ఔటర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రయాణికులకు ఊరట కలిగించింది. నెల్లూరు–బళ్లారి జాతీయ రహదారి భాగంగా, చాపాడు మండలం విశ్వనాథపురం గ్రామం నుంచి మైదుకూరు మున్సిపాలిటీ గోపిరెడ్డిపల్లె వరకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్ బైపాస్ వలన పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.