Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: ప్రమాదాలకు కేరాఫ్ గా అడ్రస్ గా తెలంగాణ చౌక్.. ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు..

Karimnagar, Karimnagar | Sep 12, 2025
కరీంనగర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తా తెలంగాణ చౌక్ ప్రమాదాలకు కేరాఫ్ గా మారిపోయింది. ప్రతి రోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తెలంగాణ చౌక్ నుండి రాంనగర్ వైపు వెళ్తున్న ఆటో.. ఆ వైపే వెళ్తున్న ద్విచక్ర వాహనం ఒకదానికి ఒకటి ఢీకొట్టడంతో ఆక్టివా వాహనం పై వెళ్తున్న మహిళ కిందపడి పోయింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఇద్దరిని మందలించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సమయంలో ఓ కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో మళ్లీ ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. తరుచు తెలంగాణ చౌక్ వద్ద ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us