ఎట్టకేలకు తాడిపత్రి పట్టణానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకున్నారు. 15 నెలల నిరీక్షణ అనంతరం మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. జిల్లా SP జగదీశ్, తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రత్యేక బందోబస్తుతో ఆయనను తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి తీసుకొచ్చారు. నివాసానికి చేరుకోగానే కేతిరెడ్డికి గుమ్మడికాయతో హారతి ఇచ్చి దిష్టి తీశారు. దాదాపు 15 నెలల తర్వాత ఆయన తాడిపత్రికి వచ్చారు.