కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలను సృష్టించి లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి మరియు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం మధ్యాహ్నం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, శెట్టిబలిజ సామాజిక వర్గీయుల్లో విభేదాలు సృష్టించేల కథనాలు వచ్చాయన్నారు. కొత్త విషయాలను తెరపైకి తెచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.