మైదుకూరు మున్సిపాలిటీలో జరగనున్న వివిధ అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ శనివారం సమీక్ష నిర్వహించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తిచేసి పనులు త్వరగా చేపట్టాలన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ ఏపీ రవీంద్ర ఉన్నారు.