వచ్చే నెల 4న జరగనున్న గణేష్ నిమజ్జనానికి ఎటువంటి అంతరాయం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ వెల్లడించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు.గత ఏడాది నిమజ్జనంలో తలెత్తిన లోపాలు పునరావృతం కాకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అదనపు లైటింగ్, క్రేన్లకు డ్రైవర్లు, మెకానిక్‌లు, చెక్‌పోస్ట్ నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు మైక్ సిస్టమ్, మూడు షిఫ్టుల్లో పారిశుద్ధ్య సిబ్బంది నియామకం వంటి అంశాలను కోరారు.కమిషనర్ స్పందిస్తూ.. “ని