తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి టిఆర్ఎస్ ప్రభుత్వం మంచినీళ్లు తీసుకురాలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరానికి మంచినీటి అవసరాలు తీర్చడానికి 7000 కోట్లు ఖర్చు పెట్టామని ఆయన అన్నారు. 2008లో కాంగ్రెస్ ప్రారంభించిన మంచినీటి ప్రాజెక్టు కూడా తామే పూర్తి చేశామని హరీష్ రావు తెలిపారు.