శక్తి యాప్ పై సోమవారం నంద్యాల శక్తి టీం హెడ్ కానిస్టేబుళ్లు ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ, మహిళా పోలీస్ స్నేహలత అవగాహన కల్పించారు. పాణ్యం మండలం నెరవాడలోని ఎంజీపీ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్లోని విద్యార్థినులకు ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు శక్తియాప్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులు అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ను వినియోగించుకోవాలని సూచించారు.