వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చి 14 నెలలైనా పట్టించుకోలేదని ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా వెంకటయ్య అన్నారు. ఓబులవారిపల్లె మండలం మంగంపేట అగ్రహారంలో ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం పులగంటి శ్రీనివాసులు అధ్యక్షతన ఆదివారం వడ్డెర సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడ్డెర కులస్తులందరూ, ఐక్యంగా సంఘటితంగా సమస్యల పరిష్కారానికి, హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. 1972లో ఎస్టీ జాబితాలో ఉన్న వడ్డెరలను బిసి ఏ లోకి మార్చారని అన్నారు.