మంచిర్యాల జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సాధారణ తనిఖీలలో భాగంగా నస్పూర్ లో గల ఈవిఎం గోదామును అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవిఎం గోదాము వద్ద భద్రత సిబ్బందితో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సిసి కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.