కూకట్పల్లి ఆల్విన్ కాలనీ పేస్ 2 లో శ్రీకాంత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినాయకుడి ప్రతిమలను స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణహిత వినాయక విగ్రహాల వినియోగం ద్వారా సమాజంలో అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.