పి.గన్నవరం మండలంలో గోదావరి ఉధృతి ఆదివారం తగ్గు ముఖం పట్టింది. మండలంలోని గంటి పెదపూడి లంక, ఊడిమూడి లంక, అరిగెల వారి పేట, బూరుగులంక, బెల్లంపూడి లంక గ్రామాల ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి నిత్య అవసరాల కోసం మరపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. లంక గ్రామాల రైతులు మాట్లాడుతూ గోదావరి వరద ఉధృతి తగ్గడంతో ఇబ్బందులు తొలగి పోతాయన్నారు.