ములుగు మండలం అబ్బాపూర్ గ్రామంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. నేడు శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన రహదారిపై ఇరు పక్కల ఉన్న చెట్ల మీద నివాసం ఏర్పాటు చేసుకుని వాహనదారులపై దూకుతున్నాయి. కోతుల బెడదకు వాహనదారులు బెంబేలెత్తి ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి గ్రామం నుంచి కోతులను బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.