పాత్రికేయులకు ఇచ్చిన మీడియా అక్రిడేషన్లను మరో మూడు నెలలు పాటు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. మీడియా ప్రతినిధులకు కొత్త అక్రిడేషన్లను జారీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే జీఓ జారీ చేసిందని తెలిపారు. ఈ జీఓ ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడేషన్ల కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొదలు కానుందని తెలిపారు. ఈ లోగా పాత్రికేయులు అసౌకర్యానికి గురికాకుండా ప్రస్తుతం ఉన్న అక్రిడేషన్లను నవంబరు నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్వరోలు జారీ చేసిందని శనివారం తెలిపారు