ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి వద్ద వినాయక చవితి సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ బుధవారం మధ్యాహ్నం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీర్థ ప్రసాదాలను స్వీకరించి మాట్లాడుతూ భక్తుల సౌభాగ్యాన్ని రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడిపంటల సుఖసంతోషాలను కోరుకున్నట్లు తెలిపారు. 69 అడుగులతో ఖైరతాబాద్ వినాయకుడు ప్రజలకు దర్శనం ఇస్తున్నాడని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు.