జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం లోని తుంగూర్ గ్రామంలో రేబిస్ వ్యాధితో మరణించిన 3 సంవత్సరాల బాలుడు రక్షిత్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తుంగూరు గ్రామం కు వెళ్లి పరామర్శించి, కొంత ఆర్థిక సహాయం అందించారు. అన్ని విధాలుగా బాలుడి కుటుంబానికి అండగా ఉంటానని ఆ బాలుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.