రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు ప్రధాన రహదారి పై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రక్ వెనుక చక్రం మోటార్ సైకిల్ ను ఢీకొట్టడంతో వ్యక్తి గాయపడ్డాడు. ట్రాక్టర్ అదుపు తప్పి పంట బోధిలోకి దూసుకెళ్లింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.