Parvathipuram, Parvathipuram Manyam | Aug 27, 2025
కుప్పా నాయుడు వ్యవసాయ కార్మికుల కోసం, గిరిజనుల కోసం ఎనలేని కృషి చేశారని, ఆయన లక్ష్యం ఆశయం మరువలేనిదని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ప్రజల తరఫున పోరాడిన ఆర్. కుప్పా నాయుడు 13వ వర్ధంతి సభ బుధవారం పార్వతీపురం స్థానిక సుందరయ్యభవనంలో ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగునాయుడు అధ్యక్షతన జరిగింది. మొదటగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిరా, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.రామస్వామిలతో కలిసి కుప్పా నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.