కళ్యాణదుర్గం లోని విద్యానగర్ కాలనీలో బుధవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు వినాయకుని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలతో కలిసి కోలాటం ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలందరూ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. వినాయక చవితి చాలా పవిత్రమైన పండుగన్నారు.