గుత్తి ఆర్ఎస్ లో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.నవీన్ కుమార్ అనే విద్యార్థి రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం వేగంగా వచ్చే ఢీ కొనింది.ప్రమాదంలో నవీన్ కుమార్ గాయపడ్డాడు.ఏడో తరగతి చదువుతున్న నవీన్ కుమార్ పాఠశాలకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.కుటుంబ సభ్యులు నవీన్ కుమార్ ను గుత్తి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.