ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల నాలుగో శనివారం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుదర ప్రాంతాల నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చిన ఫిర్యాదుదారులు నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.