కూకట్పల్లి భరత్ నగర్ బ్రిడ్జి పక్కన ఓ పంచర్ షాప్ లో అగ్నిప్రమాదం జరిగింది. విషయం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సనత్ నగర్ ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. స్థానికుల సమాచారం ఇవ్వకపోతే పక్కనే ఉన్న మరికొన్ని ఫుట్పాత్ షాపులు అగ్ని ప్రమాదంలో కాలిపోయేవని ఫైర్ సిబ్బంది తెలిపారు.