కోడూరులో బిచ్చగాళ్ల వేషధారణలో భిక్షాటనకు వస్తున్న దొంగ స్వాములను ప్రజలు నమ్మవద్దని ఎస్సై చాణిక్య తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ, మండలంలో కొందరు స్వాముల వేషధారణలో వచ్చి, ప్రజల పరిస్థితి బాగోలేదని, అమ్మవారికి పూజ చేస్తే దుష్ట శక్తులు వదులుతాయని నమ్మించి నగదు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దొంగ స్వాములను నమ్మి ప్రజలు మోసపోరాదని ఆయన హెచ్చరించారు.