సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఈనెల 28న అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడి పేరు నరసింహులు, తల్లి మల్లమ్మ అని తెలిపినట్లు వెల్లడించారు. మృత వయస్సు 42 - 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎరుపు నలుపు గీతల చొక్కా ధరించి ఉన్నారని, ఎవరికైనా మృతుడి వివరాలు తెలిస్తే 8712656763 నెంబర్ కు తెలపాలన్నారు.