తిరుపతి జిల్లా నాయుడుపేటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి బజారు వీధుల మీదుగా పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. యూరియా వాడకంపై రైతులకు నినాదాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు పలు విషయాలను రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది రైతులు పాల్గొన్నారు.