Parvathipuram, Parvathipuram Manyam | Aug 29, 2025
మాస్టర్ ప్లాన్ రోడ్డు నుండి తమ వీధిని తప్పించాలని పార్వతీపురం మున్సిపాలిటీలోని మద్దాల వీధికి చెందిన ప్రజలు కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో టి పి ఎస్ నారాయణరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కులవృత్తులు కూలీలుగా బతుకుతున్న వీధి నుండి మాస్టర్ ప్లాన్ రోడ్డు వేస్తే అక్కడ ఇల్లు ఉండే పరిస్థితి లేదన్నారు. అలాగే కమర్షియల్ ట్యాక్స్ లు కూడా చెల్లించుకునే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కాబట్టి తక్షణమే మాస్టర్ ప్లాన్ నుండి ఆ వీధిని తప్పించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పౌరులు సంక్షేమ సంఘం నాయకులు పాకల సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.