పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలోని భుజంగరావు ఫారంలో సోమవారం భారీ కింగ్ కోబ్రాను అటవీ శాఖ సిబ్బంది, స్నేక్ క్యాచర్స్ పట్టుకున్నారు. ఫారంలో గడ్డకు సమీపంలోని ఓ గదిలో మూలన ఉండడం చూసిన ఫారం యజమాని వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 20 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాను పట్టుకొని రిజర్వ్ ఫారెస్ట్లో విడిచిపెట్టారు. ఈ పాము అత్యంత విషపూరితమని అటవీశాఖ అధికారులు తెలిపారు.