అమీర్పేటలోని ఎల్లారెడ్డి గూడలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మంగళవారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. వైయస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత కరెంటు వంటి పథకాలు చరిత్రలో నిలిచిపోయాయని తెలిపారు.