గోకవరం దేవి చౌక్ లో కనకదుర్గమ్మ అమ్మవారికి విజయదశమి ఉత్సవాలకు అమ్మవారి ఆలయ సేవకులు భారీ ఏర్పట్లు చేస్తున్నారు. అమ్మవారి ప్రియ భక్తులు విశ్వ హిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అమ్మవారి ఊరేగింపు మహోత్సవాల కార్యక్రమానికి సుమారుగా 50 లక్షల రూపాయలతో రథాన్ని చేయించారు. తొమ్మిది రోజులపాటు జరిగే విజయదశమి ఉత్సవాలకు పలు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాధ శర్మ తెలిపారు.