బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సోమవారం వినాయక చవితి పండుగ సంధర్భంగా మట్టి వినాయక ప్రతిమలను పెట్టి పూజించాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే వాడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన రంగుల విగ్రహాలను వాడి పర్యావరణానికి హాని కలిగించరాదని అవగాహన కల్పిస్తూ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థుల ద్వారా ర్యాలీ నిర్వహించడం జరిగింది. సామాజిక బాధ్యతతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు.