ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గౌడ కులస్తులను బహిష్కరించినట్లు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1:45 గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు సమావేశం నిర్వహించి మాట్లాడారు. గౌడ కులస్తులను స్వచ్ఛమైన కళ్ళు అమ్మమన్నందుకు తమపై గ్రామ బహిష్కరణ చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారని అందులో నిజం లేదని తెలిపారు. ఈ విషయంపై పోలీసులు గ్రామంలోకి వచ్చి నిజ నిజాలు తెలుసుకోవాలని కోరారు.