వాజేడు మండలంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నేడు శనివారం రోజున సాయంత్రం 4 గంటలకు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం ఏడుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వెంకటాపురం నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్నారనే సమాచారం మేరకు మండపాక వద్ద పట్టుకున్నామన్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా 30 కేజీల గంజాయి దొరికిందన్నారు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. గంజాయి విలువ రూ. 15 లక్షలు ఉంటుందన్నారు.