వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగాడి శివారులో చెత్త కుప్పలో కంటి వెలుగు అద్దాలు కలకలం రేపాయి. కెసిఆర్ ఫోటో ఉంటే చెత్తకుప్పలో వేస్తారా అని బి ఆర్ ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు సురేష్ ప్రశ్నించారు. కెసిఆర్ ఫోటో ఉన్నందున గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు అద్దాల సెట్స్ను చెత్తలో పడి వేయడం ఎంతవరకు సమంజసం అని, ప్రజాధనాన్ని వృధా చేసినట్టే అని ఆయన పేర్కొన్నారు. ప్రజాధనాన్ని ఫోటో ఉన్నంత మాత్రాన వృధా చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.