పీలేరు నియోజకవర్గంలో ఎంపీ వెంకట మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ షేక్ హబీబ్ భాషా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎంపీని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలు కప్పి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి వద్ద రోగులకు అన్నదానం నిర్వహించారు.కలికిరి మండలం కలికిరి పట్టణంలోని బీడీ కాలనీ వద్ద వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎంఐ హనీఫ్ ఆధ్వర్యంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైయస్సార్ సీపీ శ్రేణులతో కలిసి భారీ కేకును మండల కన్వీనర్ రమేష్ రెడ్డి, రత్నశేఖర్ రెడ్డి కోసి పంపిణీ చేశారు