మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపద్యంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆదేశాల మేరకు మంగపేట మండలంలో డప్పు చాటింపు వేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి పరివాహక ప్రాంతాల్లో చిన్నపిల్లలు, గర్భిణీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారులు డప్పు చాటింపు వేసి అలర్ట్ చేశారు.