నిత్యవసర వస్తువులు ఇకపై మరింత తక్కువ ధరకే ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా జిఎస్టి పనుల హేతుబద్ధీకరణ చేస్తామని ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎర్రకోట నుండి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కీలక ప్రకటనని సాకారం చేయబోవటం ఎంతో ఆనందాయకమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. ఈ జీఎస్టీ పనుల హేతుబద్ధీకరణ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలు అనునిత్యం ఇంట్లో వాడే వస్తువులు ఇకపై మరింత తక్కువకి అందుబాటులోకి రావడం ద్వారా వాళ్ల కుటుంబంలో ఆర్థికంగా గణనీయమైన లబ్బి కొందరున్నారని ఈ మార్పు ఈనెల 22వ తారీకు నుండి అమలులోకి రానుంది అన్ని అన్నారు