మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపం వద్ద గుర్తుతెలియని రైలు నుండి జారిపడి, గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని మార్చిలో భద్రపరిచినట్లు రైల్వే పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మృతుడి వద్ద దానాపూర్ టు పెరంబుర్ వరకు గల రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్ మాత్రమే ఉందని,మృతదేహాన్ని గుర్తించిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.