మే 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న *జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్-2025* కు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని అదనపు ఎస్పీ మహేందర్, నీట్ పరీక్ష సిటీ కోఆర్డినేటర్ ప్రిన్సిపల్ డాక్టర్ హుస్సేన్ , డీఎస్పీ ప్రసన్నకుమార్, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి, పర్యవేక్షించారు. తరగతి గదులను తనిఖీ చేసి, నిఘా నేత్రాల (సీసీ కెమెరాలు), జామర్ల పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.366 మహిళా అభ్యర్థులు, 121 మంది పురుష అభ్యర్థులు మొత్తం -487 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలుగా ఏర్పాట్ల