అద్దంకి మండలంలో వృద్ధులకు, వికలాంగులకు రేపటి వరకు ఇంటి వద్ద రేషన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మార్వో శ్రీ చరణ్ శనివారం తెలిపారు. రేషన్ కోసం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రేషన్ డీలర్లు నేరుగా ఇంటి వద్దకు వచ్చి రేషన్ సరుకులను అందజేస్తారని ఎమ్మార్వో తెలియచేశారు. డీలర్లకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా రేషన్ ను పంపిణీ చేయాలని సూచించడం జరిగిందని అన్నారు.