ప్రకాశం జిల్లా కొండపి మరియు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాలు జరిగాయి. కొండపిలో కూడా గణేష్ నిమజ్జన వేడుకలు జరగగా పోలీసులు ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ఎటువంటి అల్లర్లకు గొడవలకు తవు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసు సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర రాత్రి వరకు కొనసాగింది.