కన్ఫేక్షనరీ షాపులో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం కన్ఫేక్షనరీ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని భారీ మొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది.ఈ ఘటన మద్నూర్ మండల కేంద్రంలో జరిగింది.శుక్రవారం టీచర్స్ కాలనీలోని బేకరి హాల్ సెల్ శాప్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అగ్నిమంటలను ఆర్పి కొన్ని బేకరి వస్తువులను బయటకు తీశారు