పీలేరు నియోజకవర్గంలో వినాయక చవితి సందర్భంగా 2వ రోజు గురువారం సాయంత్రం నుంచి నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా పలు గ్రామాలలో జరిగాయి. వినాయక చవితిని ఉత్సవాల్లో భాగంగా రెండు రోజులుగా వినాయక ప్రతిమలకు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం మండపాల నుంచి వినాయక విగ్రహాలను డప్పు వాయిద్యాల మధ్య గ్రామాలలో ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. అదేవిధంగా వినాయక విగ్రహాల చేతిలోని లడ్డూలను వేలం వేసి విక్రయించారు.గండబోయిన పల్లిలో వినాయకుని లడ్డూ 12వేల రూపాయలకు జయా రెడ్డి కైవసం చేసుకున్నట్లు నిర్వాహకులు పులి సత్యనారాయణ రెడ్డి తెలిపారు.