జిల్లాలో మరో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ జాగ్రత్త వహించాలని జిల్లా ఎస్పీ శివ కిషోర్ తెలిపారు.. భారీ వర్షాలకు జిల్లాలో పలు వాగులు ఏరులు రోడ్లపై ప్రవహిస్తున్నాయని ప్రజలు ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించవద్దని సూచించారు.. ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందని.. కాలవలు ప్రవహించే ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు..