ఈనెల 7 వ తేదీ ఆదివారం సాయంత్రం కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు పెద్ద ఎత్తున జూదరులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో 11 లక్షల 83 వేల 940 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు పట్టణ సీఐ నరేష్ బాబు తెలిపారు. మంగళవారం రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జమ్మలమడుగు మండలం దప్పెర్ల నుంచి గండికోటకు వెళ్లే దారిలో చెట్ల పొదల్లో జూదమాడుతున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. సిబ్బందితో ఆకస్మిక దాడులు చేసి వారిని పట్టుకున్నామన్నారు. నిన్న వారిని నోటీసులు ఇచ్చి పంపించామని సీఐ తెలిపారు.