కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు కనీస సదుపాయాలు అందుబాటులో లేవని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు రమణ బుధవారం తెలిపారు. ప్రథమ చికిత్స పెట్టె, మూత్రశాలలు, గాలి పట్టే యంత్రం వంటి అవసరమైన సౌకర్యాలు లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు వెంటనే తనిఖీలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సేవా సమితి నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు సంజీవ రాయుడు కూడా పాల్గొన్నారు.