జుక్కల్ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి - మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే... గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారాన్ని చెల్లించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. గురువారం జుక్కల్ నియోజక వర్గంలోని డోంగ్లి, మద్నూర్ మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. క్షేత్ర స్థాయిలో తిరుగుతూ దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి సాయంగా రైతుబంధును అందించేవారని, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ