గోపాలపురం మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు లారీలను మైనింగ్ అధికారులు గురువారం సాయంత్రం గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు వాటిని వెంటనే సీజ్ చేసి గోపాలపురం పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ అక్రమ రవాణాలో పాలుపంచుకున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.