అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో గ్రామపంచాయతీ కార్మికులకు జూన్, జూలై, రెండు నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, మండల కార్యదర్శి పి. జాన్ ప్రసాద్ డిమాండ్ చేశారు. రైల్వే కోడూరు లోని సిఐటియు కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడుతూ.. పండుగ రోజు కార్మికుల పస్తులతో ఉండాల్సి వస్తుందని , రోజువారి గడవని కార్మికులకు, కనీసం, నెలకు జీతం ఐదో తేదీ లోగా ఇవ్వాలని కోరారు. వారికి 13,600 ఇస్తున్నారని, కొందరికి స్వచ్ఛభారత్ కార్మికులకు మాత్రం 10 వేలు ఇస్తున్నారని, ఒకే పని చేస్తున్న, జీతాల్లో వ్యత్యాసం ఉందని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.